Connect with us

Andhra

గుర్తు తెలియని వాహనం ఢీకొని పెద్ద పులి మృతి – జాగ్రత్తలు తీసుకోవాలి.. జంతు ప్రేమికులు

Published

on

పల్నాడు: పల్నాడు జిల్లాలోని మాచర్ల నియోజకవర్గం పరిధిలో వెల్దుర్తి మండలం సిరిగిరిపాడు గ్రామ శివారులోని జాతీయ రహదారి NH–565 పై తెల్లవారు జామున గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఒక పెద్దపులి అక్కడికక్కడే మృతి చెందింది.

సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు ఘటన స్థలానికి చేరుకుని పులి బాడీని పరిశీలించారు. ఈ సందర్భంగా విజయపురి సౌత్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సుజాత మాట్లాడుతూ.. విజయపురి సౌత్ ఫారెస్ట్ రేంజ్ పరిధిలో మొత్తం నాలుగు పెద్దపులులు ఉన్నాయని, వాటిలో ఒక పులి తెల్లవారుజామున గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో మృత్యువాత పడిందని, ఘటనపై కేసు నమోదు చేసి, పులిని ఢీకొన్న వాహనాన్ని గుర్తించేందుకు అటవీశాఖ, పోలీస్ అధికారులు సంయుక్తంగా దర్యాప్తు చేపట్టామన్నారు.

ఇదిలా ఉండగా, అటవీ జంతువుల సంరక్షణ కోసం జాతీయ రహదారులపై వేగ నియంత్రణ చర్యలు, హెచ్చరిక బోర్డులు, వైల్డ్‌లైఫ్ క్రాసింగ్ సూచికలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని పర్యావరణవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని జంతు ప్రేమికులు కోరుతున్నారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.