Connect with us

Andhra

క్రిస్మస్ సందర్భంగా పేద అక్క,చెల్లెళ్లకు చీరల పంపిణీ.. మత సామరస్యానికి ప్రతీకగా డాక్టర్ మహబూబ్ వలి సేవ..

Published

on

తర్లుపాడు: ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలంలోని తుమ్మలచెరువు గ్రామంలో క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని గ్రామంలో క్రైస్తవ అక్కచెల్లెళ్లకు ఉచితంగా చీరల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ప్రముఖ సామాజిక సేవకులు, జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనారిటీ డిపార్ట్మెంట్ చైర్మన్, సివిల్ పబ్లిక్ వెల్ఫేర్ సంస్థ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ షేక్ మహబూబ్ వలి ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎంపీజే మార్కాపురం పట్టణ అధ్యక్షుడు షేక్. నాగూర్ మీరా వలి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా డాక్టర్ షేక్ మహబూబ్ వలి మాట్లాడుతూ.. క్రిస్మస్ అనేది ప్రేమ, శాంతి, త్యాగం అనే విలువలను గుర్తు చేసే పర్వదినమని, మతభేదాలు లేకుండా అందరూ ఒకటిగా కలిసి పండుగలు జరుపుకోవడమే నిజమైన సామాజిక సౌహార్దం, మత సామరస్యమని, పేదల జీవితాల్లో ఆనందం తీసుకురావడమే నా సేవా లక్ష్యం అన్నారు, అలాగే కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ పేదలు, మైనారిటీలు, అణగారిన వర్గాల పక్షానే నిలుస్తుందని ఆయన స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని చేపడతామని డాక్టర్ మహబూబ్ వలీ తెలిపారు.

పేదల సంక్షేమం, సామాజిక ఐక్యతే లక్ష్యంగా డాక్టర్ షేక్ మహబూబ్ వలి చేపట్టిన ఈ కార్యక్రమం తుమ్మల చెరువు గ్రామస్తుల ప్రశంసలు అందుకుంది. ఉచితంగా చీరలు అందుకున్న క్రైస్తవ సోదరీమణులు డాక్టర్ షేక్ మహబూబ్ వలికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తర్లుపాడు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షేక్. హుస్సేన్, షేక్.షఫీ, సైదా, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.