Connect with us

Andhra

అంగరంగ వైభవంగా క్రిస్మస్ క్యారల్స్..

Published

on

మార్కాపురం: ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని ABM కాంపౌండ్ లో గల తెలుగు బాప్టిస్ట్ టౌన్ చర్చి ఆధ్వర్యంలో మెగా క్రిస్మస్ కేరల్స్ మంగళవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. SVKP కళాశాల వద్ద నుండి పూల సుబ్బయ్య ఆర్చి వరకు ర్యాలీని పట్టణంలోని క్రైస్తవులు భారీ ఎత్తున నిర్వహించారు, మార్కాపురం సభ్యులు కందుల నారాయణరెడ్డి రిబ్బన్ కట్ చేసి ర్యాలీని ప్రారంభించారు. పట్టణ పురవీధులలో ఈ ర్యాలీ సాగింది. ఈ ర్యాలీలో క్రిస్మస్ పాటలు పాడుతూ, దైవ సందేశాన్ని పాస్టర్లు వినిపించారు.

ఈ కార్యక్రమ కన్వీనర్లుగా K జాన్ వినయ్ కుమార్, K బాబు ప్రసాద్, TS జైపాల్, D బాబి, V శ్యాం ప్రకాష్, P విజయ్, S ప్రభుదాస్, B పాల్ మనోహర్, B సతీష్ లు వ్యవహరించారు. తెలుగు బాప్టిస్ట్ టౌన్ చర్చ్ అధ్యక్షులు దేవరకొండ సామ్యూల్, ఉపాధ్యక్షులు గుర్రం ఆర్థర్, కార్యదర్శి పులుకూరి జయరావు, స్థానిక సంఘ కాపరి పులుకూరి అమృతేజ్ మరియు పట్టణంలోని క్రైస్తవులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.