Andhra
మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా గళం విప్పుతున్న కంభం ముస్లిం యూత్..
కంభం: ప్రకాశం జిల్లా కంభం ముస్లిం యూత్ కమిటీ ఆధ్వర్యంలో కంభం పట్టణంలో “Say No To Drugs” అనే నినాదంతో మత్తు పదార్థాల వ్యతిరేక అవగాహనా కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో భాగంగా మత్తు పదార్థాల వల్ల కలిగే దుష్ప్రభావాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ పోస్టర్లు ప్రదర్శించారు. ఈ అవగాహనా పోస్టర్‌ను ఎం.ఈ.ఓ (M.E.O)-1 సత్తార్, ఎంఈఓ_2 శ్రీనివాసులు చేతుల మీదుగా ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఎంఈఓ సత్తార్ మాట్లాడుతూ.. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవరుచుకోవాలని సూచించారు. మత్తు పదార్థాల వినియోగం వల్ల వ్యక్తిగత జీవితంతో పాటు కుటుంబాలు, సమాజం కూడా తీవ్రంగా నష్టపోతుందని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో కంభం ముస్లిం యూత్ కమిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని, మత్తు పదార్థాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ప్రజలను కోరారు. సమాజంలో అవగాహన పెంపొందించడమే లక్ష్యంగా ఇటువంటి కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తామని ముస్లిం యూత్ కమిటీ సభ్యులు తెలిపారు.
![]()
