Andhra
రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించిన డి.ఎస్.పి నాగరాజు…
మార్కాపురం: ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో నేడు బుధవారం పోలీస్ స్టేషన్ లో రౌడీషీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సబ్ డివిజన్ పోలీస్ అధికారి యు. నాగరాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రౌడీ షీటర్లు క్షణకావేశంలో తీసుకున్న నిర్ణయాలు జీవితాలను నాశనం చేయడమే కాకుండా కుటుంబాలు వీధిన పడే పరిస్థితులు దాపరిస్తాయని తెలిపారు. ఇకనుండి అయినా ప్రతి ఒక్కరూ సత్ప్రవర్తన కలిగి ఉండి సమాజంలో మంచి పౌరులుగా మెలగాలని, తప్పుడు మార్గాలను విడనాడాలని ఆకాంక్షించారు.
ఒక్కసారి పోలీస్ రికార్డుల్లో పేరు నమోదు అయితే కోర్టుల చుట్టూ, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ ఉండవలసి వస్తుందని, మానసిక ప్రశాంతత లేకుండా జీవనం సాగించడం జరుగుతుందని అన్నారు. అంతేకాకుండా కుటుంబ విలువల గురించి వివరిస్తూ, ప్రధానంగా నేటి యువతరం చెడు మార్గాల వైపు ఆకర్షితులు అవుతున్నారని ఎట్టి పరిస్థితుల్లో మంచి మార్గంలో నడవాలని హెచ్చరించారు, ఈ కార్యక్రమంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ పి. సుబ్బారావు పట్టణ, గ్రామీణ ఎస్ఐలు ఎమ్ సైదుబాబు, పి అంకమ్మరావు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
![]()
