Andhra
ఆదోనిని నూతన జిల్లాగా ఏర్పాటు చెయ్యాలి.. యంపీజే రాష్ట్ర ఉపాధ్యక్షులు లాల్కోట్ ఖదీర్
ఎమ్మిగనూరు: ఆదోని జిల్లా సాధన కోసం యెమ్మిగనూరు జేఎసి ఆధ్వర్యంలో విద్యార్థి, యువజన, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఏడవ రోజు రిలే నిరాహార దీక్షలో జమాతే ఇస్లామీ హింద్ పట్టణ అధ్యక్షుడు చాంద్ బాషా, మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు లాల్కొట్ ఖదీర్, ఐడియల్ యూత్ మూమెంట్ పట్టణ అధ్యక్షుడు ముల్లా ఇస్మాయిల్, స్టూడెంట్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ పట్టణ అధ్యక్షుడు మహేష్ మహబూబ్, ఎంపీజే పట్టణ అధ్యక్షుడు షేక్షావలి, సెక్రటరీ పరుశురాం, ట్రెజరీ అబ్దుల్ అజీమ్,NACOCI &MPJ మహిళా సభ్యురాలు వసూందరా దేవి కూర్చున్నారు.
ఈ సందర్భంగా ఎంపీజే రాష్ట్ర ఉపాధ్యక్షులు లాల్కోట్ కదిర్ భాషా మాట్లాడుతూ.. ఆదోని జిల్లా అవశ్యకత గురించి చెబుతూ ఆలూరు, ఆదోని, పత్తికొండ, మంత్రాలయం, ఎమ్మిగనూర్ కు సంబంధించిన ప్రాంతాలలో మధ్య ఉన్నటువంటి ప్రాంతం ఆదోని., చాలా సంవత్సరాల నుంచి వ్యాపార పరంగా సెకండ్ ముంబైగా పేరుగాంచిన పట్టణమని, ఈ ప్రాంతాల నుండి జిల్లా హెడ్ క్వార్టర్ కర్నూలుకు వెళ్లాలంటే దాదాపు 150 కిలోమీటర్ల ప్రయాణం చేయవలసిన పరిస్థితి అని, అలాగే ఈ ప్రాంతంలో నిరుద్యోగం, నీళ్లు, నిరక్షరాస్యత చాలా ఎక్కువ ఉన్నందున వలసలు ఎక్కువ అయ్యాయని, అలాగే ఈ ప్రాంతంలో నీళ్లు లేక పండించిన పంట చేతికి రాకపోగా, గిట్టుబాటు ధర లేక ఈ ప్రాంతంలో రైతుల ఆత్మహత్యలు పెరిగాయని అన్నారు.
ప్రస్తుత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు పాదయాత్రలో పశ్చిమ ప్రాంతం ఆదోనిని అభివృద్ధి చేస్తారని, అధికారంలో వచ్చి రెండు సంవత్సరాలు అయినాప్పటికీ ఆదోని ప్రాంతం గురించి పట్టించుకోకపోవడం శోచనీయం అని, వెంటనే ఆదోనిని నూతన జిల్లాగా ప్రకటించాలని లాల్కోట్ అబ్దుల్ ఖదీర్ డిమాండ్ చేశారు.
![]()
