Connect with us

Andhra

ప్రజా దర్బార్ లో సమస్యలకు పరిష్కారం.. ఎమ్మెల్యే కందుల

Published

on

తర్లుపాడు: మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి మార్కాపురం నియోజకవర్గంలోని తర్లుపాడు మండలంలోని తర్లుపాడు గ్రామంలో తాసిల్దార్ ఆఫీస్ వద్ద ” ప్రజా దర్బార్” కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అర్జీదారుల నుంచి అర్జీలు స్వీకరించి సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను వీలైనంతవరకు పరిష్కరించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ.. ఈరోజు 13 అర్జీలు వచ్చాయని వీటిలో చాలా అర్జీలు వరకు ఇక్కడే పరిష్కారం చూపామని, ముఖ్యంగా వీటిలో రెవెన్యూ సమస్యలు, రోడ్లు, డ్రైనేజీ సమస్యలు ఎక్కువగా వచ్చాయని దాదాపు అన్ని పరిష్కరించామని మిగిలిన వాటిని తరువాత నిర్వహించే ప్రజా దర్బార్ లోపు సమస్యను పరిష్కరిస్తారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తర్లుపాడు మండల అన్ని శాఖల అధికారులు, తెలుగుదేశం నాయకులు మరియు అర్జిదారులు పాల్గొన్నారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.