Connect with us

Andhra

ఏపిలో ఉర్దూను రాష్ట్ర అధికారిక ప్రభుత్వ చిహ్నంలో చేర్చాలి – డాక్టర్ షేక్ మహబూబ్ వలి డిమాండ్..

Published

on

మార్కాపురం: ఏపిలో ఉర్దూను రాష్ట్ర అధికారిక ప్రభుత్వ చిహ్నంలో చేర్చాలని కోరుతూ ప్రకాశం జిల్లా మార్కాపురం సబ్ కలెక్టర్ కి కాంగ్రెస్ పార్టీ జిల్లా మైనారిటీ డిపార్ట్మెంట్ చైర్మన్ డాక్టర్ షేక్ మహబూబ్ వలి వినతి పత్రాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా డాక్టర్ షేక్ మహబూబ్ వలి మాట్లాడుతూ.. గతంలో 2022 సంవత్సరంలో అధికారంలో ఉన్న వైయస్సార్సీపి రాష్ట్ర అధ్యక్షులు మరియు మాజీ ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉర్దూ భాషను ఆంధ్రప్రదేశ్ రెండవ అధికారిక భాషగా ప్రకటించారని, తెలంగాణ ప్రభుత్వం 2017లో ఉర్దూ భాషను తెలంగాణ రాష్ట్ర రెండో అధికార భాషగా ప్రకటించి, రాష్ట్ర చిన్హంలో ఉర్దూ భాషకు గుర్తింపు గౌరవం ఇచ్చి గౌరవించిందని, భారతదేశ అధికారిక భాష ఉర్దూను భారత రాజ్యాంగంలో 8వ షెడ్యూల్లో గుర్తించబడి ఉత్తరప్రదేశ్, బీహార్, తెలంగాణ మొదలైన రాష్ట్రాల్లో ప్రముఖమైన భాషగా ఉందని, కావున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికారిక చిహ్నంలో ఉర్దూ భాష పొందుపరచాలని డాక్టర్ షేక్ మహబూబ్ వలి మీడియా ద్వారా ప్రభుత్వాన్ని కోరారు.

ఈ కార్యక్రమంలో మార్కాపురం కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు సయ్యద్ ఇమ్రాన్, జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ సుభాని, కాంగ్రెస్ పార్టీ నాయకులు షేక్ ఖాసిం, షేక్ అబ్దుల్లా తదితర నాయకులు పాల్గొన్నారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.