Andhra
మార్కాపురంలో ఖుర్ఆన్ కంఠస్థ పోటీలు..
మార్కాపురం: యునైటెడ్ ఫోరం ఖురాన్ స్టడీస్ మరియు జమాత్ ఏ ఇస్లామి హింద్ ఆధ్వర్యంలో ఖుర్ఆన్ కంఠస్త పోటీలు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని స్థానిక ప్రెస్ క్లబ్ లో జరిగాయి.
ఈ పోటీలు జిల్లాలో పలుచోట్ల సెలెక్ట్ అయిన విద్యార్థులకు ఈరోజు మార్కాపురం పట్టణంలో జరిగాయి. ఇక్కడ 10 మంది విద్యార్థులు క్వార్టర్ ఫైనల్లోకి సెలెక్ట్ అయ్యారు. సెలెక్ట్ అయిన విద్యార్థులకి క్వార్టర్ ఫైనల్ పోటీలు నెల్లూరులో జనవరి 25న నిర్వహించడడం జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా A1 గ్లోబల్ సంస్థల అధినేత మీర్జా షంషీర్ అలీ బేగ్ మరియు పల్నాడు జమాత్ ఎ ఇస్లామి హింద్ పల్నాడు జిల్లా బాద్యులు మౌలానా అబ్దుల్ రెహమాన్ సుఫిలు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో జమాత్ ప్రకాశం జిల్లా తూర్పు, పశ్చిమ జిల్లాల బాద్యులు ఆష్రఫ్ అలీ, గౌస్ ఖాన్ లు, పట్టణ ఉపాధ్యక్షులు ఇస్మాయిల్, SIO జిల్లా అధ్యక్షులు షేక్ ఖలీద్, IYM జిల్లా బాధ్యులు తలహా, రసూల్, ముహమ్మద్ ఖాన్, జమాత్, SIO, IYM సభ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
![]()
