Connect with us

Andhra

ఎమ్మెల్యే తాటిపర్తినీ హెచ్చరించిన APSMFC రాష్ట్ర డైరెక్టర్ సాదిక్..

Published

on

మార్కాపురం: తాటిపర్తి చంద్రశేఖర్ మిమ్మల్ని ఎమ్మెల్యేగా చేసింది నియోజకవర్గ ప్రజల అభివృద్ధికి పాటుపడాలని తప్ప, టీవీల ముందు కూర్చుని నోటికొచ్చినట్టు మాట్లాడమని కాదని, గుర్తుంచుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ సయ్యద్ సాదిక్ హెచ్చరించారు.

ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని స్థానిక ప్రెస్ క్లబ్ నందు ఆయన పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిన్న ఒక టీవీ ఛానల్ లో ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్, ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై నోరు పారేసుకోవడ పై ఆయన ఘాటుగా స్పందించారు. అసెంబ్లీకి కూడా వెళ్లకుండా చానళ్లకే పరిమితమైన నీకు ఎవరు ఏమి అభివృద్ధి చేస్తున్నారో ఎలా తెలుస్తుందని ప్రశ్నించారు. తన పదవికి వన్నె తెచ్చే విధంగా ఆయన శాఖలో ప్రక్షాళన దిశగా సమీక్షలు నిర్వహించి, ఎంతో మందికి పదోన్నతులు కల్పిస్తూ ఉద్యోగుల అభివృద్ధికి సైతం పాటు పడుతున్నారని గుర్తు చేశారు. అంతేకాకుండా మా అధినేత ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఏ రోజు నిర్లక్ష్యం చేయకుండా ప్రజల అభివృద్ధికి నిరంతరం శ్రమిస్తూ ఎన్నో వెనుకబడిన గిరిజన ప్రాంతాలలో వారి అవసరాలను గుర్తించి, రోడ్లు, కరెంటు తదితర సమస్యలను ఎప్పటికప్పుడు తీరుస్తూ, ప్రజల మన్ననలు పొందుతున్నారని తద్వారా జీర్ణించుకోలేక ఈ విధమైనటువంటి వ్యక్తిగత విషయాలపై, తప్పుడు ఆరోపణలు, మాటలు మాట్లాడడం మంచి పద్ధతి కాదని ఆయన సూచించారు.

ఈ పాత్రికేయుల సమావేశంలో జనసేన నాయకులు పేరూరి రమేష్, షేక్ కాశింవలి సోను, దూదేకుల కాసిం, షేక్ హుస్సేన్ పాల్గొన్నారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.