Andhra
తుఫాన్ బాధితులకు ఆహార పొట్లాలు వితరణ చేసిన వైసిపి నేత గౌస్ మొహియుద్దీన్..
మార్కాపురం: ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో మొంథా తుపాన్ ప్రభావంతో వర్షాల కారణంగా అవస్ధలు ఎదుర్కొంటున్న పేద ప్రజలకు మాస్టర్ సోషల్ సర్వీస్ తరపున ఆహార ప్యాకేట్లను వైసీపీ మైనార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సయ్యద్ గౌస్ మోహిద్దీన్ అందజేశారు.
ఈ సందర్భంగా సయ్యద్ గౌస్ మోహిద్దీన్ మాట్లాడుతూ.. కష్టాల్లో ఉన్న పేదలను ఆదుకోవడమే తమ నేత జగన్మోహన్ రెడ్డి యొక్క నైజమని, రాష్ట్రంలో భారీ వర్షాలు కురస్తున్న వేళ మార్కాపురం పట్టణంలో పలు ప్రాంతాలు జలమయంగా మారాయని, వాటివల్ల కష్టాలు ఎదుర్కొంటున్న పేదలకు పలు రకాల ఆహార ప్యాకెట్లను వితరణ చేసి ఆదుకోవడం సంతోషంగా ఉందని, కష్టాలలో ఉన్న వారిని ఆదుకోవడమే నిజమైన సేవ అని,ఇలాంటి సేవ చేయడానికి తమ ప్రియతమ నేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఆయన తనయుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదర్శమని ఆయన వెల్లడించారు. ప్రతి వైసీపీ నేత, కార్యకర్త ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు. మున్ముందు కూడా ఇలాంటి సేవ కార్యక్రమాలను తాను కొనసాగిస్తానని సయ్యద్ గౌస్ మోహిద్దీన్ పేర్కొన్నారు.
![]()
