Andhra
కమ్యునిటి ఛెంజ్ మేకర్ అవార్డు-2025 అందుకున్న యువకేర్ అధ్యక్షుడు అరిఫుద్దీన్..
కమ్యూనిటీ ఛేంజ్ మేకర్ అవార్డు–2025 అందుకున్న యువ కేర్ అధ్యక్షుడు అరీఫుద్దీన్ షేక్ మొహమ్మద్‌కు తుమ్మలపల్లి కళాక్షేత్రం, విజయవాడలో ఘనంగా జరిగిన కంపేనియన్ షిప్ 5వ వార్షికోత్సవ వేడుకల్లో యువా కేర్ వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థాపకుడికి గౌరవం.
విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన Companionship 5వ వార్షికోత్సవం సందర్భంగా యువ కేర్ వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థాపకుడు మరియు అధ్యక్షుడు అరీఫుద్దీన్ షేక్ మొహమ్మద్ కి “కమ్యూనిటీ ఛేంజ్ మేకర్ అవార్డు – 2025” ప్రదానం చేయబడింది.
ఈ అవార్డును మాజీ ఐఏఎస్ అధికారి ఇమ్తియాజ్ మరియు ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ బ్రదర్ సిరాజుర్ రహ్మాన్ చేతుల మీదుగా అరీఫుద్దీన్ స్వీకరించారు. మానవతా సేవా రంగంలో మరియు సామాజిక సేవలో విశిష్టమైన కృషి చేసినందుకు ఈ పురస్కారం అరీఫుద్దీన్ గారికి లభించింది. ఆయన యువా కేర్ వెల్ఫేర్ సొసైటీ ద్వారా అనేక హృదయాన్ని తాకే సామాజిక కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఎన్. మహమ్మద్ ఫారూక్ (న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి), టీ.డి. జనార్ధన్ (ఎంఎల్సీ, కృష్ణా జిల్లా)తదితర పలువురు ప్రముఖులు, సామాజిక మార్పు దాతలు పాల్గొన్నారు.
అవార్డును స్వీకరించిన అనంతరం అరీఫుద్దీన్ మాట్లాడుతూ..“ఈ అవార్డు నా ఒక్కరిది కాదని, నాకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరి సహకార ఫలితమని, నా వెనుక నిలిచిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలని, ఇలాంటి సేవా కార్యక్రమాలను ఎప్పటికీ ఆపను” అని ఈ సందర్భంగా తెలిపారు.
![]()
