Connect with us

Andhra

ఉత్తమ్ కుమార్ ఆద్వర్యంలో ఘనంగా కోటి సంతకాల సేకరణ ఉద్యమం..

Published

on

మార్కాపురం: ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ కోటి సంతకాల ఉద్యమం కార్యక్రమం నేడు సాయంత్రం ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని 10, 11 వ బ్లాక్ లలో ఉత్తమ్ కుమార్ ఆద్వర్యంలో ఘనంగా జరిగింది. ఈసందర్భంగా 11వ బ్లాక్ ఇంఛార్జి ఉత్తమ్ కుమార్ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం మెడికల్ కళాశాలలను పిపిపి విధానం తీసుకుని రావడాన్ని తీవ్రంగా విమర్శించారు. ఈ విధానం పేద ప్రజలకు చాలా ఇబ్బంది అవుతుంది అని అన్నారు. ముఖ్య అతిథులుగా మాజీ శాసనసభ్యులు, మార్కాపురం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ అన్నా రాంబాబు, వైసిపి స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ వెన్నా హనుమారెడ్డి, వైసీపీ నెల్లూరు పార్లమెంటు పరిశీలికులు జెంకె వెంకటరెడ్డి, మాజీ రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ ఎమ్ షంషీర్ అలీబేగ్, మాజీ మార్కెట్ యార్డు కమిటీ చైర్మన్ జి శ్రీనివాులురెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ చిర్లంంచెర్ల కృష్ణ, పట్టణ అధ్యక్షుడు షేక్ సలీం, వైసిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.