Andhra
సామాజిక సేవకు గాను కంపియన్షిప్ కమ్యునిటీ ఛాలెంజ్ మేకర్ అవార్డు పొందిన డాక్టర్ మహబూబ్ వలీ..
విజయవాడలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో కంపియన్షిప్ కమ్యూనిటీ చేంజ్ మేకర్ (CCC) వారు నిర్వహించిన అవార్డ్ 2025 సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ నుంచి వివిధ రంగాలలో ఉత్తమ ప్రతిభ చూపిన వ్యక్తులకు 50 మందికి ప్రధానం చేశారు. సామాజిక సేవా చేసినందుకు ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనారిటీ శాఖ ప్రధాన కార్యదర్శి డాక్టర్ షేక్ మహబూబ్ వలికి కూడా ఈ అవార్డును ప్రధానం చేశారు. ఈ అవార్డును మోటివేషన్ స్పీకర్ బ్రదర్ సిరాజుర్రహ్మాన్ మరియు జూరీ ప్రెసిడెంట్ జనాబ్ ఇంతియాజ్ మైనారిటీ స్పెషల్ వెల్ఫేర్ ఆంధ్రప్రదేశ్ మరియు కంపెన్షిప్ కమ్యూనిటీ చేంజ్ మేకర్ వ్యవస్థ స్థాపకులు షేక్ షబ్బీర్ ఈ అవార్డును ప్రధానం చేశారు. డాక్టర్ మహబూబ్ వలీకు ఇప్పటికే పలు సేవా కార్యక్రమాలకు గాను దేశ వ్యాప్తంగా 106 అవార్డులు రావడం గమనార్హం.
![]()
