Andhra
వైసిపి జిల్లా లీగల్ సెల్ వైస్ ప్రెసిడెంట్ గా గెల్లి చౌడేశ్వరావు..
మార్కాపురం: వైసిపి జిల్లా లీగల్ సెల్ వైస్ ప్రెసిడెంట్ గా మార్కాపురం పట్టణానికి చెందిన ప్రముఖ న్యాయవాది గెల్లి చౌడేశ్వరరావు నియమితులయ్యారు. ఈ మేరకు శనివారం ఆయనకు కేంద్ర కార్యాలయం నుండి అధికారిక ఉత్తర్వులు వెలుబడ్డాయి. ఈ సందర్భంగా గెల్లి చౌడేశ్వరరావు మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో వైసిపి ప్రకాశం జిల్లా లీగల్ సెల్ వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నిక చేసిన గిద్దలూరు మాజీ శాసనసభ్యులు, మార్కాపురం నియోజకవర్గ ఇన్చార్జ్ అన్నా వెంకట రాంబాబుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నియోజకవర్గ ఇంచార్జి అన్నా వెంకట రాంబాబు ఆధ్వర్యంలో పార్టీ అభివృద్ధి కోసం శక్తి వంచన లేకుండా అహర్నిశలు శ్రమిస్తానని, వైయస్ జగన్మోహన్ రెడ్డిని తిరిగి మరల ముఖ్యమంత్రిగా, అన్నా రాంబాబును ఎమ్మెల్యేగా చేసుకోవడమే తన ధ్యేయమని గెల్లి తెలిపారు.
![]()
