Connect with us

Andhra

బాణాసంచా దుకాణాలకు అనుమతులు తప్పనిసరి.. పామూరు సీఐ ఎం భీమా నాయక్

Published

on

పామూరు: దీపావళి పండుగ సందర్భంగా పామూరు సర్కిల్ పరిధిలో బాణాసంచా విక్రయాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు ప్రకాశం జిల్లా పామూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం బీమా నాయక్ తెలిపారు. శనివారం పామూరులో దీపావళి సందర్భంగా అనుమతి పొందిన దుకాణాలను సీఐ భీమా నాయక్ స్వయంగా పరిశీలించారు. అనుమతులు లేకుండా బాణాసంచా దుకాణాలు నిర్వహించడం లేదా అక్రమంగా బాణాసంచా నిల్వ చేయడం చట్టపరంగా నేరమని ఆయన హెచ్చరించారు. అనుమతులు పొందకుండా వ్యాపారం నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అలాగే బాణాసంచా నిల్వ కేంద్రాలు, విక్రయాలు నివాసాలకు నిర్దేశించిన దూరంలో ఉండాలని అగ్ని ప్రమాదాలు జరిగితే చేపట్టాల్సిన జాగ్రత్తలపై నిర్వాహకులు అవగాహన కలిగి ఉండాలని దుకాణదారులు తగిన భద్రతా జాగ్రత్తలు పాటించాలని సిఐ ఎం భీమా నాయక్ సూచించారు. అగ్ని ప్రమాదాలు సంభవించకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో ఆయన వెంట పామూరు ఎస్ఐ కిషోర్ బాబు తదితరులు ఉన్నారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.