Connect with us

Andhra

రాష్ట్రస్థాయి కబడ్డీ మరియు చెస్ పోటీలకు మార్కాపురం బాలుర హైస్కూల్ విద్యార్థులు ఎంపిక..

Published

on

స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ వారి ఆధ్వర్యంలో నిన్న ప్రకాశం జిల్లా సింగరాయకొండ, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించిన జిల్లాస్థాయి అండర్-19 కబడ్డీ మరియు చెస్ పోటీలలో జిల్లాపరిషత్ బాలుర ఉన్నత పాఠశాల, మార్కాపురం విద్యార్థులు బి. నాగరాజు, యం. అభి, మరియు టి. నాగవిష్ణులు కబడ్డీ నందు మరియు కౌశిక్ చెస్ విభాగం నందు పోటీల్లో పాల్గొని అత్యంత ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక కావడం జరిగింది. వీరు త్వరలో పల్నాడు జిల్లా మరియు మన్యం జిల్లా పార్వతీపురం నందు జరగనున్న రాష్ట్రస్థాయి కబడ్డీ మరియు చెస్ పోటీల్లో ప్రకాశం జిల్లా జట్టుకి ప్రాతినిధ్యం వహిస్తారు. ఎంపికైన విద్యార్థులను మరియు వారికి శిక్షణ ఇచ్చిన వ్యాయామ ఉపాధ్యాయులు డి. శ్యామలాదేవి యస్.ఎ, పీడీ, పి. దామోదర రెడ్డి మరియు కె. ఓబులేసులను పాఠశాల ప్రధానోపాధ్యాయులు యం. చంద్రశేఖర్ రెడ్డి, ఉపాధ్యాయ & ఉపాధ్యాయేతర సిబ్బంది మరియు పట్టణ ప్రజలు వారి కృషిని అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.