Andhra
బోధి పాఠశాలలో గణాంక దినోత్సవం వేడుకలు
పల్నాడు జిల్లా తుమ్మల చెరువు బోధి పాఠశాలలో ఈరోజు గణాంక దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ దినోత్సవాన్ని భారత గణాంక శాస్త్ర పితామహుడు ప్రొఫెసర్ ప్రసాంత చంద్ర మహాలనోబిస్ జయంతిని పురస్కరించుకొని కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులు గణాంకాల ప్రాముఖ్యతపై ప్రసంగాలు, చార్టులు, నమూనాలు ప్రదర్శించి మరింత ఆకర్షణీయంగా మార్చారు. వీటిపై గణాంకాలు మన దైనందిన జీవితంలో, ఆర్థిక రంగంలో, పరిశోధనల్లో ఎంత ముఖ్యమో పాఠశాల డైరెక్టర్ శ్రీ కళ్యాణ్ రామ్ విద్యార్థులకు వివరించారు.ఈ సందర్భంగా గణాంకాలపై క్విజ్ పోటీ, చిన్న చిన్న బార్ గ్రాఫ్, పై చార్ట్, టాలీ మార్క్స్ పై ఆటల ప్రదర్శన కూడా నిర్వహించబడింది. పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీధర్ విద్యార్థుల సృజనాత్మకతను అభినందించి, గణాంకాల ద్వారా ప్రపంచాన్ని అర్థం చేసుకునే శక్తి పెరుగుతుందని అన్నారు.కార్యక్రమం చివర్లో ధన్యవాదములతో గణాంకాల విలువను గుర్తుచేసుకుంటూ వేడుక ముగిసింది. ఈ కార్యక్రమానికి గణిత ఉపాధ్యాయురాలు జాకీరా కీలక పాత్ర వహించారు.
![]()
