Andhra
ఘనంగా APJ అబ్దుల్ కలాం జయంతిని నిర్వహించిన ముస్లిం పెద్దలు..
గిద్దలూరు: ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో మాజీ రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా గిద్దలూరు నియోజకవర్గ ముస్లిం మైనారిటీ అభివృద్ధి సంఘం అధ్యక్షులు గుడిసె మహబూబ్ బాషా ఆధ్వర్యంలో గిద్దలూరు పట్టణంలోని ఆలీంలు హఫీజ్లు, మరియు ముస్లిం పెద్దలందరూ కలిసి ఏపీజే అబ్దుల్ కలాం విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గుడిసె మహబూబ్ బాషా మాట్లాడుతూ.. ఏపీజే అబ్దుల్ కలాం సేవలు మన భారతదేశానికి చిరస్థాయిగా మిగిలిపోతాయని, ఆయన భారతదేశానికి మొట్టమొదట అగ్ని క్షిపనిని కనుగొన్న గొప్ప శాస్త్రవేత్తని, అణు పితామహుడని, అలాగే భారతదేశానికి రాష్ట్రపతిగా పనిచేసి ప్రపంచ దేశాలలోనే మంచి పేరును గడించి మన భారతదేశానికి గొప్ప పేరు, ప్రతిష్టలు తెచ్చారని, ఆయన సేవలు మరపురానివని అటువంటి మహానుభావుడు మరల జన్మించడని ఆయన 94 జయంతి సందర్భంగా కొని యాడారు. ఈ కార్యక్రమంలో లియాకత్ అలీ, మౌలానా అబ్దుల్ హక్, మౌలానా అబ్దుల్ రషీద్, ఆఫీస్ ఉస్మాన్, మౌలానా గఫార్, చాంద్రమానం భాషా, ఆలీబాబా, సయ్యద్ నాయబ్ రసూల్, జమాలుద్దీన్ మరియు ముస్లిం మైనారిటీ నాయకులు పాల్గొన్నారు.
![]()
