Connect with us

Andhra

జగనన్న కాలనీలో మౌళిక సదుపాయాలు కల్పించమని కాలనీ వాసుల వేడుకోలు..

Published

on

ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని నాగుల వరం రోడ్డులోని జగనన్న కాలనీలో మౌళిక సదుపాయాలు లేక అక్కడి దుర్భర పరిస్థితులకు అక్కడ నివాసం ఉండలేక పోతున్నామని కాలనీ వాసులు వాపోతున్నారు. గత ప్రభుత్వం హాయంలో ఇక్కడ 350 గృహాలను పేదలకు పట్టాలు ఇచ్చారు. ఒకవైపు పట్టణంలో పెరిగిన అద్దెలు కట్టలేకున్నామని, చాలా వరకు గృహ నిర్మాణాలను చేపట్టిన.. రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ తదితర మౌలిక సదుపాయాలు లేక అక్కడికి వెళ్లలేక పోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షం పడితే చెరువును తలపిస్తూ, చుట్టూ పిచ్చి చెట్లు పెరిగిపోయి విష పురుగులు ఎక్కువగా తిరుగుతున్నాయని అంటున్నారు.

ప్రస్తుతం కూటమి ప్రభుత్వం కల్పించుకుని రోడ్లు, డ్రైనేజీ తదితర మౌళిక సదుపాయాలు కల్పిస్తే తమ గృహాలకు వెళ్తామని ప్రభుత్వానికి విన్నవించుకున్నారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.