Andhra
ధార్మిక విద్య నేర్పిన గురువు అబ్లుల్లా ఉమ్రి ఇకలేరు..
AP: ఎందరినో ధార్మిక విద్య నేర్పిన గురువు మౌలానా అబ్దుల్లాహ్ ఉమరి (పామర్రు) హైదరాబాద్లో తుది శ్వాస విడిచారు. కృష్ణ జిల్లా పామర్రులో (జమియతుల్ హుమైరా ముస్లిం బాలికల ధార్మిక విద్య సంస్థ) పురాతన విద్య సంస్థలో ప్రిన్సిపల్ గా ఉంటూ హఫిజ్, అలీమా కోర్సులను చదివించారు. వీరి సమక్షంలో వేలాదిమంది దేశ నలుమూలల నుండి బాలికలు, మహిళలు ధార్మిక విద్యను అభ్యసించడం గమనార్హం. ఆయన పార్ధిక దేహాన్ని తన సొంత గ్రామం పామర్రుకు రాత్రి 7-00 గంటలకు తీసుకుని రానున్నారని సమాచారం. ఆయన జమాఅతే ఇస్లామి హింద్ సభ్యులు గా ఉన్నారు. ఎంతోమంది కి ధార్మిక విద్య నేర్పిన ఆయన మృతి సమాజానికి తీరని లోటని JIH అమీర్ ఎ హాల్ఖా (రాష్ట్ర అధ్యక్షులు) ముహమ్మద్ రఫిఖ్ మరియు మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్(MPJ) రాష్ట్ర అధ్యక్షులు షేక్ అబ్దుల్ రజాక్ లు తమ విచారాన్ని వ్యక్తంచేశారు. వారి కుటుంబానికి సహన స్థైర్యాలు ప్రసాదించాలని వారు కోరారు.
![]()
