Andhra
విద్యార్థులకు బస్సు సౌకర్యం కల్పించాలి..MPJ
ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలంలోని పరిసర గ్రామాల విద్యార్థిని, విద్యార్థులు తుమ్మచెరువు జడ్పీ హైస్కూల్ కు రావాలంటే మూడు నుంచి నాలుగు కిలోమీటర్లు నడిచి రావాల్సిన పరిస్థితి ఉందని. ముఖ్యంగా సీత నాగులవరం, సూరెపల్లి, కేతగుడిపి, బుడ్డ పల్లి, జగన్నాధపురం తదితర గ్రామస్తులు, విద్యార్థులకు తుమ్మల చెరువు మీదుగా ఆర్టీసీ బస్సు తిప్పవలసిందిగా మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ (యంపిజే) మార్కాపురం పట్టణ అధ్యక్షుడు షేక్ నాగూర్ మీరావలి సూపరింటెండెంట్ కు వినతి పత్రం ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ ప్రాంత విద్యార్థిని, విద్యార్థులు వర్షాకాలంలో తుమ్మల చెరువు హైస్కూల్ వెళ్లలేక మానుకొనవలసిన పరిస్థితి ఉన్నందున, తాడివారి పల్లికు వెళ్లే బస్సును ఈ గ్రామాల మీదుగా తిప్పాలని, ఈ ప్రాంత విద్యార్థిని, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వెంటనే బస్సు ఏర్పాటు చేయాలని షేక్ నాగుర్ మీరా వలి కోరారు. ఈ కార్యక్రమంలో యంపీజే మాజీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు షేక్ రసూల్, మాజీ పట్టణ అధ్యక్షుడు షేక్ అమీర్, పట్టణ ఉపాధ్యక్షుడు సయ్యద్ మస్తాన్ వలి తదితరులు పాల్గొన్నారు.
![]()
