Andhra
పోలీస్ స్టేషన్ వద్ద ఎస్సీల ధర్నా.. ఉద్రిక్తత
ప్రకాశం జిల్లా మార్కాపురంలో పట్టణ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ప్రకాశం జిల్లా చీమకుర్తిలో లారి డ్రైవర్ మద్యం తాగాడని లారీ యజమాని కొట్టటంతో డ్రైవర్ స్రృహ కోల్పోవడం, పొదిలిలో ప్రధమ చికిత్స అనంతరం మార్కాపురం పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు చేయడానికి వచ్చిన లారీ డ్రైవర్, సిఐటియు పట్టణ అధ్యక్షుడు రూబెన్.
ఇచ్చిన కేసు తీసుకోవడం లేదని పట్టణ ఎస్ఐ సైదుబాబుపై ఒత్తిడి తెచ్చిన లారీ డ్రైవర్, రూబెన్. కేసు పెట్టడానికి వచ్చిన వారిపై పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో వారి బంధువులు, సుందరయ్య కాలనీ వాసులు పోలీస్ స్టేషన్ మెయిన్ గేటు ఎదుట ధర్నా నిర్వహించారు.
ధర్నా నిర్వహిస్తున్న వారిని పోలీసులు నివారించే ప్రయత్నంలో కొంత ఉద్రిక్తత నెలకొంది. దీంతో పోలీస్ స్టేషన్ లోపలికి చొచ్చుకుని వచ్చే ప్రయత్నం చేసిన కాలనీ యువకులు. కేసు విషయం పరిష్కరించేందుకు సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు DKM రఫి పోలీసులతో చర్చిస్తున్నారు.
![]()
