Andhra
భూమి వివాదంపై ఆర్యవైశ్య నాయకుల ప్రెస్ మీట్..
మార్కాపురం: ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో భూవివాదం సంభందించి ఆర్యవైశ్య నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించారు.
టీడీపీ జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షులు వక్కలగడ్డ మల్లికార్జున ఈ సందర్భంగా మాట్లాడుతూ.. “ఆర్యవైశ్యులమని చులకన చేస్తూ ఎవరు అడ్డగోలుగా వ్యవహరించినా చట్టపరంగా ముందుకెళ్తాం” అని “1922 నాటి భూమిని కొందరి చేతులు మారి, మేము 2011లో చట్టబద్ధంగా కొనుగోలు చేశామని, ఇప్పుడు కొందరు దళితులు ఆ భూమి మాదని చెబుతూ మాపై దాడికి దిగడం, అడ్డదిడ్డంగా కేసులు పెట్టడం సరికాదని, మా వద్ద అన్ని చట్టపరమైన ఆధారాలు ఉన్నాయని, చట్టం ముందు మేము తప్పు చేయలేదని నిరూపిస్తాం” అని అన్నారు.
అలాగే 1922 సంవత్సరం నుంచి 1954 లోపు ఈ భూమికి సంబంధించిన వారు ఇతరులకు రిజిస్ట్రేషన్ చేశారని కాబట్టి ఈ భూమి POT కిందికి రాదని,“మీ భూమి అయితే మీ వద్ద ఆధారాలు ఉంటే చూపించండి అని సవాల్ విసిరారు. కానీ చట్టాన్ని మించి ప్రవర్తించడం సరి కాదని” స్పష్టం చేశారు.
![]()
