Andhra
వాసవి కుటుంబ సురక్ష పధకం చెక్కును పంపిణీ చేసిన వాసవి క్లబ్స్ జిల్లా గవర్నర్ గంగిశెట్టి కిరణ్ కుమార్..
మార్కాపురం: ప్రకాశం జిల్లా మార్కాపురంలో వాసవి కుటుంబ సురక్ష పధకం చెక్కును వాసవి క్లబ్స్ DIST V207A జిల్లా గవర్నర్ గంగిశెట్టి కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో వాసవి కుటుంబ సురక్ష పధకం చెక్ పంపిణి చేశారు. రీజియన్-1 పరిధిలో మార్కాపురం వాసవి వనిత క్లబ్ సభ్యులు VKSP NO.11668 గల సభ్యులు పెసల బాలమ్మ మరణించిన దరిమిలా వారి వారసులు పెసల రవికుమార్ పేరు మీద 403800=00 రూపాయల చెక్ ను వారికి అందజేయడం జరిగింది. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వారు నిర్వహించిన ఈ వాసవి కుటుంబ సురక్ష పథకం ద్వారా మాకు చెక్ అందజేసినందుకు సంతోషంగా ఉందని మృతురాలి కుటుంబ సభ్యులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా IEC ఆఫీసర్ వాసవియన్ గోల్డెన్ స్టార్ సూరే ఉమాదేవి, జిల్లా గవర్నర్ వాసవియన్స్ గోల్డెన్ స్టార్ KCGF గంగిశెట్టి కిరణ్ కుమార్, క్యాబినెట్ సర్వీసెస్ సెక్రెటరీ సూరే సురేంద్ర, రీజియన్ చైర్మన్ నారాయణం వెంకటేశ్వర్లు, వాసవి వనిత క్లబ్ ప్రెసిడెంట్ పరుచూరి ధనలక్ష్మి, సెక్రటరీ టంగుటూరి కళ్యాణి, ట్రెజరర్ తటవర్తి ఆదిలక్ష్మి, వాసవి మెంబెర్ అచ్చుత రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
![]()
