Connect with us

Andhra

గాజా యుద్ధం ముగింపు.. కాల్పుల విరమణపై ఇజ్రాయెల్, హమాస్ సంతకాలు.. ట్రంప్ హర్షం

Published

on

కైరో: ఇజ్రాయెల్, హమాస్ మధ్య గాజా యుద్ధానికి ముగింపు పడేలా అతిపెద్ద 20-సూత్రాల ప్లాన్లో మొదటి దశకు రెండు పక్షాలు సంతకాలు చేశాయి. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ అధికారికంగా తన సోషల్ మీడియా ద ట్రూత్ ద్వారా ప్రకటించారు. ఈ ఒప్పందం ప్రకారం, హమాస్ దగ్గర ఉన్న 48 మంది ఇజ్రాయెల్ బందీలందరూ త్వరలోనే విడుదల అవుతారు. ఈ వారాంతంలో విడుదల అయ్యే ఛాన్స్ ఉంది. ఐతే.. 48 మందిలో 20 మంది మాత్రమే జీవించి ఉన్నారు. మిగతా వారిని మృతదేహాలుగా అప్పగిస్తారు. ఖైదీల విడుదల తర్వాత ఇజ్రాయిల్ మళ్లి కాల్పుల విరమణ చేస్తుందా! అనేది వేచి చూడాలి..

ఈ యుద్ధాన్ని తానే ఆపానని చెప్పుకోవడం ద్వారా.. నోబెల్ శాంతి బహుమతి కొట్టేయాలని ట్రంప్ ప్రయత్నిస్తున్నారని సమాచారం. యుద్ధం ముగియడం సంగతి ఎలా ఉన్నా.. తనకు నోబెల్ రావడమే కీలకం అనేలా ఆయన ధోరణి ఉంది.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.