Andhra
షాట్ న్యూస్ ఎఫెక్ట్.. గుంతపై సిమెంట్ బల్ల వేసిన మున్సిపల్ అధికారులు
మార్కాపురం: ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని 4వ వార్డులో రోడ్డుపై గుంత ఏర్పడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని నిన్న ‘షాట్ న్యూస్’ వెలుగులోకి తెచ్చిన విషయం విదితమే. వెంటనే స్పందించిన మున్సిపల్ అధికారులు తాత్కాలికంగా గుంతపై సిమెంట్ బల్ల వేశారు. దీంతో వాహనాల రాకపోకలకు కొంత ఉపశమనం కలిగింది. స్ధానికులు మున్సిపల్ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే శాశ్వత ప్రాతిపదికన గుంతను పూడ్చి, సాగర్ వాటర్ కోసం తవ్విన గుంతలలో పైపులు వేసి సిమెంట్ రోడ్డు వెయ్యాలని కోరుతున్నారు.
![]()
