Andhra
నిషేధిత వస్తువుల కోసం డాగ్ స్క్వాడ్ ఉపయోగించి విస్తృత తనిఖీలు నిర్వహించిన పోలీసులు…
మార్కాపురం: ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణం మరియు మండల ప్రాంతాలలో పోలీసులు బుధవారం పై అధికారుల ఆదేశాల మేరకు ఆకస్మికంగా విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మార్కాపురం పట్టణం మరియు మండలంలో ఆర్టీసీ బస్టాండ్, రైల్వే స్టేషన్ తదితర అనుమానాస్పద స్థలాల్లో డాగ్స్ స్క్వాడ్ ఉపయోగించి మాదక ద్రవ్యాలు మరియు నిషేధిత వస్తువులు గురించి తనిఖీలు నిర్వహించారు. మీ మీ ప్రాంతాల్లో అనుమానస్పద వ్యక్తులు సంచరిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఈ సందర్భంగా సిఐ పి సుబ్బారావు కోరారు. ఈ కార్యక్రమంలో మార్కాపురం పట్టణ ఎస్ఐ M సైదుబాబు, గ్రామీణ ఎస్ఐ పిఅంకమ్మరావు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
![]()
