Andhra
అనుమతి లేకుండా డీజే సౌండ్ బాక్సులు వాడరాదు.. సీఐ సుబ్బారావు
మార్కాపురం: ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణ మరియు మండలాల పరిధిలో ఫంక్షన్లకు, తిరునాళ్లకు ఏదైనా ఇతర కార్యక్రమాలకు ఎవరైనా మైకు సిస్టం వాడే సమయంలో డీజే లకు అనుమతి లేదని మార్కాపురం సిఐ సుబ్బారావు తెలియజేశారు.
డీజేలను అధిక సంఖ్యలో వాడటం వల్ల ఆ శబ్దాలకు ఈ మధ్యకాలంలో చిన్నపిల్లలు, వృద్ధులు, గుండె జబ్బు సమస్యలు ఉన్నవారికి అనేక సమస్యలు వస్తున్నందున, ఎవరైనా ఎలాంటి ఫంక్షన్లు, ఉత్సవాలు తిరునాళ్లు అలాగే మీటింగులు జరుపుకునే వారు ఖచ్చితంగా స్థానిక పట్టణ ఎస్ఐ M సైదుబాబు మరియు మండల ఎస్ఐ పి అంకమ్మ రావుల ద్వారా సబ్ డివిజనల్ పోలీస్ అధికారి యు నాగరాజుకి పర్మిషన్ అప్లై చేసుకోవాలని సీఐ తెలిపారు.
అలాగే పర్మిషన్ పొందిన వారు మైకు లేదా ఏదైనా సౌండ్ బాక్స్ లు పరిమిత సంఖ్యలో మాత్రమే వాడుతూ, సౌండ్ మించకుండా ఉండేలా ఉండాలని, అలాకాకుండా ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించినట్లయితే అటువంటి వారిపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుందని మార్కాపురం సీఐ పి సుబ్బారావు హెచ్చరించారు.
![]()
