Andhra
గుంతని పూడ్చండి సార్.. మున్సిపల్ అధికారులకు స్థానిక ప్రజల విజ్ఞప్తి
మార్కాపురం: ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని 4వ వార్డులో రోడ్డుపై గుంత ఏర్పడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గత రెండు సంవత్సరాల క్రితం సాగర్ వాటర్ కోసం గుంతలను తవ్వినప్పుడు మురికి కాలువ కూడా తవ్వారు. ఈ ప్రాంత ప్రజలకు గృహ నిర్మాణానికి కావలసిన మెటీరియల్స్ తోలెందుకు ఉన్నది ఈ ఒక్క దారే ఉండటంతో రెండు సార్లు ఇటుక లోడుతో ఉన్న ట్రాక్టర్లు ఇరుక్కున్నాయి. అవే గాక ఆటో చక్రాలు ఇరుక్కుని చాలా వ్యయప్రయాసలతో తీసుకున్నారు. ఈ రహదారి వెంబడి స్కూల్ కీ వెళ్లే విద్యార్థులు, మస్జిద్ కు ప్రార్ధనలకు వెళ్లే వారు ఎక్కువగా ఉన్నారు. ఈ గుంతలో ఇరుక్కుని ఇద్దరు, ముగ్గురికి కాళ్లు విరిగిన సందర్భాలు ఉన్నాయి. గుంతలోమయంతో రోడ్డు దారుణంగా ఉంది. ఎన్నిసార్లు విన్నవించిన స్థానిక ప్రజాప్రతినిధి, మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని స్ధానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెనువెంటనే సమస్యలను పరిష్కరించాలని స్థానిక ప్రజలు అధికారులను విజ్ఞప్తి చేస్తున్నారు.
![]()
