Connect with us

Andhra

జస్టిస్ గవాయ్ పై దాడి.. న్యాయ వ్యవస్థ, రాజ్యాంగంపై దాడి.. వెల్ఫేర్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు KM అబ్దుల్ సుభాన్

Published

on

విజయవాడ: గౌరవ భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీ.ఆర్.గవాయ్ గారిపై సనాతనవాది, లాయర్ రాకేష్ కిశోర్ చేసిన దాడిని వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా ఖండిస్తుంది. ఈసందర్భంగా వెల్ఫేర్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు KM అబ్దుల్ సుభాన్ మాట్లాడుతూ.. విలువలు లేని విద్వేష సంస్కృతికి ఈ హేయమైన దాడి నిదర్శనంగా ఉందని, ఇది న్యాయ వ్యవస్థ, రాజ్యాంగంపై దాడి అని, గతంలో న్యాయ స్థానాల తీర్పులపై ప్రజలు ప్రజాస్వామ్యబద్ధంగా తమ నిరసనలను తెలియచేసారే తప్ప, ఇటువంటి విద్వేష విష సంస్కృతిని ప్రదర్శించలేదని, దేశం మొత్తం ప్రజాస్వామిక వాదులంతా రాజ్యాంగ పరిరక్షకులంతా చట్టబద్ధ పరిపాలనను గౌరవించే వారంతా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గౌరవనీయులైన గవాయి గారికి అండగా నిలవాలని, లాయర్ రాకేష్ కిషోర్ సనాతని యొక్క దాడిని ముక్తకంఠంతో ఖండించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.