Andhra
ఇంటి స్థలం కబ్జా, దౌర్జన్యం కేసులో ఇద్దరి అరెస్టు.. ఎస్ఐ ఎమ్ సైదుబాబు
మార్కాపురం: ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని బాపూజీ కాలనీ లోని ఇంటి స్థలం దురాక్రమణ కేసులో గోపాలుని లక్ష్మీ భవాని W/o లేట్ చంద్ర శేఖర రావు అనువారి ఇంటి స్థలంను ఆక్రమించి, అడ్డువచ్చిన ఫిర్యాదినీ, దాడి చేసి గాయ పరచిన కేసులో ముద్దాయిలు అయిన షేక్ అబ్దుల్ రెహమాన్ S/o అబ్దుల్ సత్తార్ (Riya Mobiles), కందుకూరి శంకరాచారి S/o సోమాచారి అనువారిని మార్కాపురం పట్టణ ఎస్ఐ M సైదుబాబు అరెస్టు చేసి రిమాండ్ నిమిత్తం మార్కాపురంలోని గౌరవ AJFCM కోర్టు వారి ఎదుట హాజరు పరచగా ముద్దాయిలకు గౌరవ జడ్జీ రిమాండ్ విధించడం జరిగింది. ముద్దాయిలు ఇరువురిని మార్కాపురం సబ్ జైలుకు తరలించడమైనది.
![]()
