Andhra
షాట్ న్యూస్ ఎఫెక్ట్.. ట్రాన్స్ ఫార్మర్ మార్పు.. స్థానికుల హార్షం
మార్కాపురం: 4వ వార్డు మస్జిద్ దగ్గర కూడలి వద్ద కూలెందుకు సిద్ధంగా ఉన్న ట్రాన్స్ ఫార్మర్ గురించి స్థానికుల స్పందనను షాట్ న్యూస్ మీడియా ద్వారా అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఎట్టకేలకు కొత్తగా కట్టిన దిమ్మపై విద్యుత్ శాఖ అధికారులు నేడు ట్రాన్స్ ఫార్మర్ మార్చడం పట్ల స్థానికులు హార్షం వ్యక్తం చేశారు. గత కొన్ని సంవత్సరాలుగా అలుగులో ఉన్న ట్రాన్స్ ఫార్మర్ దిమ్మ కూలెందుకు సిద్ధంగా ఉందని ఎన్నో సార్లు విద్యుత్ అధికారులకు విన్నవిస్తుంటే..గత మూడు నెలల క్రితం దిమ్మె కట్టారు. అయినా మార్చక పోవడంతో, ప్రమాదం పొంచి ఉండటంతో స్థానికులు భయాందోళనను వ్యక్తం చేశారు. ఇప్పటికైనా విద్యుత్ అధికారులు స్పందించి ట్రాన్స్ ఫార్మర్ ను నూతనంగా కట్టిన దిమ్మె పై మార్చడంపై స్థానిక ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
![]()
