Andhra
పిపిపి విధానాన్ని విడిచిపెట్టి ప్రభుత్వం ఆధ్వర్యంలో మెడికల్ కళాశాలను ప్రారంభించాలి.. మెడికల్ కళాశాల పరిరక్షణ కమిటీ డిమాండ్
మార్కాపురం: ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని CPI కార్యాలయంలో మెడికల్ కళాశాల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యంపీజే రాష్ట్ర అధ్యక్షులు షేక్ అబ్దుల్ రజాక్ మాట్లాడుతూ.. ప్రైవేటు- పబ్లిక్- పార్ట్ నర్ షిప్ (PPP) విధానాన్ని తీసుకుని రావడాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని, ఈ విధంగా ద్వారా సామాన్య ప్రజలకు వైద్య విధానం ఖర్చుతో కూడుకున్నదిగా ఉంటుందని, అలాగే పేద వైద్య విద్యార్థులకు లక్షల రూపాయలు భారం కానుందని, పూర్తిగా కార్పోరేట్ వ్యక్తుల చేతుల్లో వెళ్లిపోతుందని అన్నారు. ప్రభుత్వం పిపిపి విధానాన్ని విడిచిపెట్టి ప్రభుత్వం ఆధ్వర్యంలో మెడికల్ కళాశాలను ఏర్పాటు చేసెంత వరకు ప్రజల్లో అవగాహన కల్పించి పెద్ద ఎత్తున ఉద్యమం ప్రొరంభించనున్నట్లు తెలిపారు. అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయంలో సూపరింటెండెంట్ రవీంద్ర రెడ్డికు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆప్ జిల్లా అద్యక్షులు వి సుదర్శన్, సిపిఐ సీనియర్ నాయకులు అందె నాసరయ్య, ఖాసిం, సిపిఎం నాయకులు డికెయం రఫి, బాలనాగయ్య, డి సోమయ్య, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సయ్యద్ ఇమ్రాన్, బిఎస్ఎన్ఎల్ రిటైర్ ఉద్యోగుల సంఘం నాయకులు సలీం, రామకృష్ణ, రైతుసంఘం నాయకులు పిచ్చయ్య, పెద్దన్న మరియు సయ్యద్ వలి(యంపిజే), రఫి (కాంగ్రెస్) తదితరులు పాల్గొన్నారు.
![]()
