Connect with us

Andhra

మార్కాపురంలో పడగలు విప్పుతున్న రేషన్ మాఫియా..

Published

on

మార్కాపురం: రేషన్ బియ్యం పక్కదారి పట్టడం, సొమ్ము చేసుకోవడం రోజు మనం వింటుంటాం.. అయితే ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో రేషన్ మాఫియా పడగలు విప్పింది. వీధుల్లోకి వచ్చి రేషన్ ఇవ్వం.. డబ్బులు మాత్రమే తీసుకొండి.. లేకపోతే మీ దిక్కున్న చోటు చెప్పుకొని మరీ చెబుతున్న పరిస్థితి. ఇంటింటికీ మిషన్ తీసుకుని వచ్చి కిలో 12 రూ.. చొప్పున డబ్బులు తీసుకొండి అని చెప్పి డబ్బులు ఇస్తున్న పరిస్థితి ఏర్పడింది. దీని వెనుక రాజకీయ, అధికారుల హస్తం ఉండటం వల్లనే ఇంతకు బరితెగిస్తున్నారని ప్రజలు నిస్సహాయతను, ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. అధికారులు దీన్ని అరికట్టి పేద ప్రజలకు ప్రభుత్వం ఇస్తున్న రేషన్ బియ్యాన్ని ఇప్పిస్తారా..? రేషన్ మాఫియాకే వెన్నుదన్నుగా నిలిస్తారా..వేచి చూడాలి.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.