Andhra
కో అప్షన్ మెంబర్ అమీరుల్లా ఖాన్ ఆకస్మిక మరణం..
మార్కాపురం: ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని గొర్లగడ్డకు చెందిన సీనియర్ నాయకులు, మాజీ కౌన్సిలర్, ప్రస్తుతం మున్సిపల్ కో అప్షన్ మెంబర్ పఠాన్ అమీరుల్లా ఖాన్(62) సాయంత్రం 4గంటల సమయంలో గుండెపోటు రావడంతో ఇంటి వద్దనే ఆకస్మికంగా మృతి చెందారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ముగ్గురికి వివాహాలు జరిగాయి. గత 35 సంవత్సరాలుగా రాజకీయాల్లో కీలకపాత్ర పోషించారు. ముఖ్యంగా గొర్లగడ్డ రాజకీయంలో ముఖ్య భూమిక పోషించారు.
![]()
