Andhra
అహింస మార్గంలో నడవండి.. న్యాయవాది మొఘల్ అన్వర్ బేగ్
మార్కాపురం: సమాజంలో ప్రతి ఒక్కరు గాంధీ చూపిన అహింసా మార్గంలో నడవాలని మండల లీగల్ సర్వీసెస్ అథారిటీ ప్యానల్ న్యాయవాది మొగల్ అన్వర్ బేగ్ పేర్కొన్నారు. గురువారం గాంధీ జయంతి పురస్కరించుకొని న్యాయమూర్తుల ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని ఉపకారగారoలోనీ (సబ్ జైలు) విచారణ ఖైదీలతో ఆయన మాట్లాడారు. క్షణికావేశంలో చేసే నేరాలతో కుటుంబాలు చిన్నాభిన్నం అవుతాయని, ప్రతి ఒక్కరు గౌరవ మర్యాదలతో జీవించాలంటే ఎదుటివారి హక్కులకు భంగం కలిగించకూడదని అన్నారు. అనంతరం ఖైదీలకు ఫలహారాలు అందించారు. ఈ కార్యక్రమంలో సబ్ జైల్ పర్యవేక్షణ అధికారి వెంకటరమణ, న్యాయవాదులు పైడిమర్రి రామచంద్ర, కడియం రామయ్య యాదవ్, జైలు సిబ్బంది పాల్గొన్నారు.
![]()
