Andhra
మార్కాపురంలో ఆయుధ పూజ నిర్వహించిన పోలీసులు..
మార్కాపురం: ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని పోలీస్ స్టేషన్ నందు దసరా పండుగ సందర్భంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ పి సుబ్బారావు ఆధ్వర్యంలో ఆయుధ పూజా కార్యక్రమాన్ని పోలీస్ సిబ్బందితో సంప్రదాయ బద్ధంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ.. ప్రజలందరూ సుఖ సంతోషాలతో దసరా పండగను జరుపుకోవాలని ఆకాంక్షించారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఎస్ఐ ఎమ్ సైదుబాబు, గ్రామీణ ఎస్ఐ పిఅంకమ్మరావు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
![]()
