Andhra
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి..
మార్కాపురం: ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోనీ గడియార స్థంభం వద్ద ఉన్న గాంధీ పార్క్ లోని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా మైనారిటీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ షేక్ మహబూబ్ వలి మాట్లాడుతూ.. ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు మార్కాపురం నియోజకవర్గ సమన్వయకర్త షేక్ సైదా పిలుపు మేరకు జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలను నిర్వహించామని, అలాగే లోక్ సభ ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ చేస్తున్న ఓట్ చోర్ – గద్దిఛోడ్ అనే కార్యక్రమం చేస్తున్న నేపథ్యంలో దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనీ ప్రజలు సంతకాల సేకరణ ద్వారా తమ మద్దతును రాహుల్ గాంధీకి తెలుపుతున్నారని అన్నారు. ప్రస్తుతం మార్కాపురం నియోజకవర్గంలోని ప్రజలందరూ స్వచ్ఛందంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి మీయొక్క సంతకాల ద్వారా రాహుల్ గాంధీకి తమ మద్దతును తెలపాలని కోరారు. ఈ కార్యక్రమంలో మార్కాపురం పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సయ్యద్ ఇమ్రాన్, ప్రకాశం జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ సుభాని, కాంగ్రెస్ పార్టీ నాయకులు షేక్ మన్సూర్, షేక్ సిద్ధిక్, సామెల్, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
![]()
