Andhra
కో ఆపరేటివ్ బ్యాంక్ ఉద్యోగి అబ్దుల్ వహ్హబ్ ఇకలేరు..
మార్కాపురం: జమాఅతే ఇస్లామి సభ్యులు మరియు కో ఆపరేటివ్ సొసైటీ’సీనియర్ అసిస్టెంట్ గా ప్రకాశం జిల్లా మార్కాపురంలో బాధ్యతలు నిర్వహిస్తున్న షేక్ అబ్దుల్ వహ్హబ్ (55) తుదిశ్వాస విడిచారు. ఆయన బాత్ రూంలో జారిపడి కింద పడగా హాస్పిటల్ కు తరలించారు. చికిత్స పొందుతూ ఆయన అల్లాహ్ సన్నిధికి చేరుకున్నారని ఆయన బంధువులు షాట్ న్యూస్ కు తెలియజేశారు. ఈయన ఒంగోలు, విజయవాడ, బాపట్ల లలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహించారు. ఈయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.
![]()
