Andhra
తురకపాలెం మృతుల కుటుంబాలకు ప్రభుత్వం 10 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించాలి..APCR రాష్ట్ర అధ్యక్షులు పిచ్చుక శ్రీనివాసరావు డిమాండ్
విజయవాడ: గుంటూరు జిల్లా తురకపాలెంలో జూన్ 25వ తేదీ నుండి నేటి వరకు హఠాత్ మరణాలు సంభవించి ఏకంగా 40 మంది దాకా మృత్యువాత హఠాత్తుగా జ్వరం, కడుపు నొప్పి, విరోచనాలతో మరణించారు. వరస మరణాలపై పూర్తి సమగ్ర విచారణ జరగాలని APCR రాష్ట్ర అధ్యక్షులు పిచ్చుక శ్రీనివాస్ అన్నారు. మంగళవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఓకే సామాజిక వర్గానికి చెందిన ఎస్సీ, ఎస్టీ మరణాలు ఎక్కువగా ఉన్నాయని గ్రామంలో కంకర, క్వారీలు ఎక్కువమంది పనిచేస్తూ ఉంటారు. ఎస్సీ కాలనీలో నీటిని సరఫరా చేసే ట్యాంకు ఒకటే ఉందని సుమారు 250 గడపలు ఉన్నాయి. వడ్డెర యాదవ, నాయుడు, కుమ్మరి, మంగలి, ముస్లింలు అన్ని కులాలకి చెందిన ప్రధాన సామాజిక వర్గాలు ఉండగా, ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు ఆర్ఎంపీ డాక్టర్ చిట్టి బాబు అనే వైద్యున్ని సంప్రదిస్తున్నారు. ఆరోగ్య తీవ్రతను బట్టి సెలైన్లు పెట్టడం సూది మందులు ఇస్తున్నాడని, చికిత్స పెద్దదైతే నగరంలో స్పెషలిస్టుల వద్దకు పంపుతున్నాడని. ప్రస్తుతం ఆర్.యం.పి వైద్యుడుని పోలీసులు అరెస్టు చేశారని. ప్రభుత్వం తాగే నీటిని చెన్నై ప్రయోగశాలలో పంపించగా నీటి కాలుష్యాన్ని ధ్రువీకరించిందని కొన్ని పరీక్షల్లో యురోనియం, మెలోడీయసిస్ లు కనుగొన్నట్లు స్థానికులు తెలిపారు అన్నారు. రెండు నెలలు పూర్తయిన కూడా ఈ వరస మరణాలకు కారణాలు మాత్రం స్పష్టంగా ఇంకా తెలియలేదన్నారు. మద్యం సేవించడం, పొగ అలవాటు ఉండడం అయ్యుండొచ్చని వైద్య అధికారులు చేసిన వ్యాఖ్యలపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారనీ అన్నారు.
కొందరికి కిడ్నీ వ్యాధులు, ఊపిరితిత్తులు, కాలేయం వ్యాధులు ఉన్నాయని అధికారులు చెప్పడం విడ్డూరంగా ఉందని స్థానిక ఎస్సీ ప్రజలపై వారి అలవాట్లు, బలహీనతలపై అధికారులు నెపంవేసి ప్రజలను దోషులుగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. చాలా కుటుంబాలు నిస్సహాయ స్థితిలో ఉన్నాయని పార్లమెంట్, అసెంబ్లీ, అధికార ప్రతిపక్షాలు నాయకులు ఈ విషయంపై స్పందించకపోవడం హాస్యాస్పదంగా ఉందని, మరణాల కారణాలపై మీనా వేషాలు లెక్కిస్తున్నారు తప్ప మృతుల కుటుంబాలను ఏ విధంగా ఆదుకోవాలి, బాధితులు గురించి మాట్లాడడం లేదని, రోజురోజుకీ చావులతో ప్రజలూ భయభ్రాంతులకు గురవుతున్నారని. ఇలాంటి పరిస్థితులలో వారి కుటుంబాలకు అండగా నిలవాలని, మరణించిన కుటుంబాలకు ప్రభుత్వం ఎటువంటి ఆర్థిక సహాయము, ప్రకటనలు చేయకపోవడం వారి నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. కాంట్రాక్టర్లకు 5000 కోట్లు రుణమాఫీ చేయగలిగిన ప్రభుత్వం అమాయక ప్రజల కుటుంబాలకు సహాయం ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. ప్రజలపై మూఢనమ్మకాలు, దురఅలవాట్లు అని నెపంవేసే ప్రయత్నం జరుగుతుంది తప్ప ఆదుకోవాలని ఆలోచన ప్రభుత్వంలో ఎందుకు కనబడడం లేదని క్రైస్తవ సంఘాల కూడా ఎటువంటి సహాయ, సహకారాలు సేవలు చేయకపోవడం అత్యంత బాధాకరం అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మరణాల విషయంలో కాలయాపన జరగకుండా మృతుల కుటుంబాలకు 10 లక్షల ఆర్థిక సహాయం చేసి, ఎస్సీ కాలనీ కోసం ప్రత్యేకంగా నీటి సరఫరా చేసే ట్యాంకులను నిర్మించాలి. అలాగే మృతుల వితంతు మహిళలకు ఉద్యోగ భరోసా కల్పించి అన్ని విధాల ఆదుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ సభ్యులు అన్సారీ, వెంకట్, సతీష్ మరియు వెల్ఫేర్ పార్టీ ఏపి రాష్ట్ర అధ్యక్షులు కె.యమ్.సుభాన్, లక్ష్మణరావు, భాషా, సలాం తదితరులు పాల్గొన్నారు.
![]()
