Connect with us

Andhra

మార్కాపురంలో ఐ లవ్ ముహమ్మద్ పోస్టర్ల ఆవిష్కరణ..

Published

on

మార్కాపురం: ఐ లవ్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క నినాదం దేశం మొత్తం మారుమ్రోగుతున్న తరుణంలో.. దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో ఐ లవ్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పి పోస్టర్ చూపించినందుకు వందలమందిపై కేసులు నమోదు చేసినందుకు నిరసన తెలిపిన ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని 10 వ వార్డులోని ప్రజలు. ఈ సందర్భంగా జుమా నమాజు ప్రార్ధనల అనంతరం మస్జిద్ బయట ఐ లవ్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అనే పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. మానవాళి శాంతి దూత, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క పోస్టర్ ఆవిష్కరించినందుకు వందలాది మందిని అరెస్టులు చేయడం రాజ్యాంగ విరుద్ధమైన చర్య అని, మా ప్రాణాలు ఉన్నంతవరకు ఆ మహానీయుడిని తమ గుండెల్లో చిరస్థాయిగా పెట్టుకుంటామని తెలిపారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.