Connect with us

Andhra

‘వాణిజ్య’ విభాగం.. ఆకస్మిక దాడులు..!*

Published

on

-కోట్లల్లో పన్నుల ఎగవేతలు

-అల్యూమినియం మార్కెట్లో ,

విస్తృత తనిఖీలు..

-వ్యాపార రికార్డులు సీజ్

 

విజయవాడ, ప్రతినిధి:-విజయవాడ వాణిజ్య పన్నుల శాఖ ప్రస్తు తానికి జూలు విదిలించింది. రాష్ట్రంలో కూటమి సర్కారు కొలువు దీరిన చాలా కాలం తరువాత నిస్తేజాన్ని వీడి, ఎట్టకేలకు శాఖాపరమైన ఆదాయంపై దృష్టి సారించింది. ఏళ్లుగా వాణిజ్య పన్నుల ఎగవేతలకు పాల్పడుతున్న వ్యాపారుల లావా దేవీలపై గుట్టుచప్పుడు కాకుండా ఇటీవల సమాచారం సేకరించింది. ఆ మేరకు వాణిజ్య పన్నుల శాఖ తనిఖీ బృందాలు తాజాగా నగరంలో.. సంయుక్త ఆపరేషను చేపట్టాయి. ఆకస్మిక తనిఖీల్లో భాగంగా ఆ బృందాలు .. గవర్నర్ పేటలోని అల్యూమినియం హోల్ సేల్ మరియు రిటైల్ షాపుల్లో సోదాలు చేపట్టాయి. ఆ తనిఖీల్లో విస్తుపోయే నిజాలు వెలుగు చూస్తున్నాయి. ఏకాబికిన కొన సాగుతున్న దాడుల్లో బుధవారం రాత్రి వరకు తనిఖీ బృందాలు.. ఓ అల్యూమినియం షాపులో కీలక సమాచారాన్ని రాబ ట్టాయి. చాలా కాలంగా పన్నులు ఎగవేస్తున్న వైనాన్ని ఆధారాలతో సహా సేక రించాయి. ఆ షాపులో రహస్యంగా దాచిన వాణిజ్య రసీదులను, ఇతర కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నాయి. సం బంధిత షాపులో కోట్ల వ్యాపారం జరు గుతున్నా ఆస్థాయి పన్నుల చెల్లింపు లేకపోవడాన్ని గుర్తించి రికార్డులను భద్రపరిచాయి. అల్యూమినియం సంబంధిత వ్యాపార సంస్థలు అనేకం ఒకే తరహాలో పన్నుల ఎగవేతకు పాల్ప డుతున్నాయని తనిఖీలో ప్రాథమికంగా గుర్తించాయి. మరోవైపు ఆకస్మిక తనిఖీలు వ్యాపారులను సర్దు బాటుకు ఉరుకులు, పరుగులు పెట్టిస్తున్నాయి. దక్షిణాదిన వాణిజ్య రాజధానిగా పేరొందిన బెజవాడ నగరంలో భిన్న రకాల వాణిజ్యoలో, ప్రతినిత్యం వందల కోట్ల వ్యాపార లావాదేవీలు జరుగుతుంటాయి. అయినా ఆ నిష్పత్తిలో గత ఎంతో కాలంగా వాణిజ్య పనులు నమోదు జరగడం లేదు. ఇప్పటికైనా ఆ శాఖ ఉన్నతాధికారగణం మేల్కొని శాఖాపరమైన తనిఖీలకు పూను కోవడం, వాణిజ్య పన్నుల రాబడికి శుభ సూచకంగా ఉన్నతా ధికార వర్గాలు భావిస్తున్నాయి. నగర వాణిజ్య పన్నుల శాఖ జాయింట్ కమిషనర్ ప్రశాంత్ కుమార్ ప్రత్యక్ష పర్యవేక్షణ లో చేపట్టిన ఈ ఆకస్మిక తనిఖీలు మరికొంత కాలం ఇలాగే కొనసాగితే.. వ్యాపార, వాణిజ్య సంస్థాలో ఏళ్లుగా పాతుకు పోయిన అక్రమాలకు తెరపడి, ప్రభుత్వానికి పన్నుల రూపంలో ఆశించిన స్థాయికి రెట్టింపు రాబడి వచ్చే అవకాశం ఉందనే అభిప్రాయం ఆ శాఖనుంచే వ్యక్తమవుతోంది.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.