Andhra
ప్రకాశం జిల్లాలో స్వల్ప భూకంపం..
ఒంగోలు: ప్రకాశం జిల్లా ఒంగోలులో స్వల్ప భూకంపం సంభవించింది. మధ్య రాత్రి 2 గంటల సమయంలో 2 సెకన్ల పాటు భూమి కంపించినట్లు ఒంగోలు వాసులు తెలిపారు. ఇది రిక్టర్ స్కేలుపై 3.4 తీవ్రతతో నమోదైనట్లు భూకంప అధ్యయన కేంద్రం తెలిపింది. సుమారు 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం నమోదు అయినట్లు వెల్లడించింది. దీంతో ప్రజలు భయప్రాంతులకు గురయ్యారు.
![]()
