Andhra
ఎరువుల దుకాణాలను తనిఖీ చేసిన సీఐ, ఎస్ఐ..
కంభం: ప్రకాశం జిల్లా కంభం సర్కిల్ సీఐ మల్లికార్జున, ఎస్ఐ నరసింహారావు మంగళవారం కంభం, పరిసర ప్రాంతాల్లో ఎరువుల దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎరువుల నిల్వలను పరిశీలించి కృత్రిమ కొరత సృష్టించేందుకు ప్రయత్నిస్తే కఠిన చర్యలు తప్పవని దుకాణదారులను తీవ్రంగా హెచ్చరించారు. రైతులకు ఎరువుల కొరత ఉందని ఎవరైనా చెబితే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని సీఐ. మల్లికార్జున కోరారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
![]()
