Andhra
మార్కాపురంలో జరుగుతున్న దోపిడికి వ్యతిరేకంగా ఒంగోలులో ధర్నా చేస్తాం.. మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు
మార్కాపురం: ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని వైసిపి కార్యాలయంలో వైసిపి ఇంచార్జి, గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు మీడియా సమావేశం నిర్వహింారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డిపై పలు అవినీతి ఆరోపణలు చేశారు. మార్కాపురం నియోజకవర్గంలో ఇసుక, మట్టి, మందు, బియ్యం, ల్యాండ్ దోపిడిపై బాధితులతో కలుపుకుని త్వరలో ఒంగోలు జిల్లా కలెక్టర్ ఆఫీస్ వద్ద ధర్నా చేస్తానన్నారు. ఎమ్యెల్యే కందుల నారాయణరెడ్డి మీడియా సమావేశంలో అధికారం ఉందనే అహంభావంతో ప్రత్యర్థి పార్టీవారిని ‘వాడు, వీడు’అంటూ సభ్యత లేని మాటలతో విమర్శించడం పట్ల రాంబాబు తీవ్రంగా స్పందిస్తూ..ఇది సంస్కారం కాదన్నారు.
వెలుగొండ ప్రాజెక్టు, మెడికల్ కాలేజి, మార్కాపురం జిల్లా కేంద్రం ఏర్పాటుపై ఎక్కడైనా మీడియా ప్రజల సమక్షంలో బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నానని, మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ విషయంలో కూటమి ప్రభుత్వ పరిపాలన బాగుందని ఈ ప్రాంత ప్రజలు చెప్తే బేషరతుగా రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని మరోసారి చెప్పారు.
ఈ మీడియా సమావేశంలో కౌన్సిలర్ చెప్పల్లి కనకదుర్గ, మున్సిపల్ కో అప్షన్ డాక్టర్ మక్బుల్ బాషా, మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎమ్ షంషీర్ అలీబేగ్, చెంచి రెడ్డి, సలీం తదితరులు పాల్గొన్నారు.
![]()
