Andhra
అడవి, వన్యప్రాణుల సంరక్షణ మా భాద్యత..DFO MD రహూఫ్
మార్కాపురం: ప్రకాశం జిల్లా మార్కాపురంలోని అటవీ శాఖ కార్యాలయంలో డీఎఫ్ఓ ముహమ్మద్ రహుఫ్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇండియాలోనే పెద్దదైన నల్లమల్ల ఫారెస్ట్ వన్య ప్రాణులను నిలయంగా ఉందని, వాటిని కాపాడడానికి అన్ని విధాలా చర్యలు తీసుకుంటామని, ఎకో టూరిజంలో గైడ్లను ఏర్పాటు చేసి అడవుల వల్ల కలిగే ప్రయోజనాల గురించి ప్రజలకు తెలియజస్తామని, నల్లమల ఫారెస్ట్ లో ఉండే పులుల సంఖ్య లెక్కింపు ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి జరుపుతామని, 2026వ సంవత్సరంలో కేంద్ర బృంద సభ్యుల ఆధ్వర్యంలో ట్రాప్ కెమెరాల ద్వారా పులుల లెక్కింపు జరుగుతుందని, మార్కాపురం డివిజన్ ఫారెస్ట్ లోని ఏడు రేంజ్ లలో అటవీ శాఖ అధికారులు అన్ని విధాలుగా అడవి సంరక్షణ చేస్తున్నారని డీఎఫ్ ఓ మీడియాకు తెలిపారు.
![]()
