Connect with us

Andhra

మార్కాపురం ప్రభుత్వ వైద్యశాలలో మౌళిక వసతులు కల్పించాలని అసెంబ్లీ దృష్టికి తీసుకెళ్లిన ఎమ్మెల్యే కందుల..

Published

on

అమరావతి- అసెంబ్లీ: ప్రకాశం జిల్లా మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి నేడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మార్కాపురంలోని సర్వేజన ప్రభుత్వ హాస్పిటల్ మౌలిక సదుపాయాలు మెరుగుపరచాలని అసెంబ్లీలో సమస్య లేవనెత్తారు. ఈ సందర్భంగా అసెంబ్లీలో మాట్లాడుతూ.. రాష్ట్రంలోనే అత్యంత వెనుకబడిన మార్కాపురం డివిజన్ లో మార్కాపురం నియోజకవర్గం, గిద్దలూరు నియోజకవర్గం మరియు యర్రగొండపాలెం నియోజకవర్గాలు ఉన్నాయని ఈ ప్రాంతంలో అత్యంత వెనుకబడిన చెంచులు, లంబాడి ప్రజలు నివసిస్తున్నారని వారికి మెరుగైన వైద్య సహాయం పొందాలంటే మార్కాపురం హాస్పిటల్ కు వస్తారని, అయితే ఇక్కడ సరైన సదుపాయాలు లేక చిన్న చికిత్సకు కూడా ఒంగోలు, నరసరావుపేట, గుంటూరు విజయవాడ నగరపాలకు వెళ్లాల్సి వస్తుందని తద్వారా ప్రజల డబ్బు సమయం వృధా అవుతున్నాయని, సమయానికి వైద్య సదుపాయం అందకపోవడంతో ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుందని సభ దృష్టికి తీసుకువచ్చారు. హాస్పటల్ 350 పడకల ఆసుపత్రిగా ఉందని కానీ దానికి తగ్గట్టు వైద్యులు గాని మౌలిక సదుపాయాలు గాని సిబ్బంది గానీ లేదని గుర్తు చేశారు. ఈ హాస్పటల్లో 113 మంది వైద్యులు కానీ 23 మంది వైద్యులే ఉన్నారని 453 మంది స్టాఫ్ ఉండాల్సిందని కానీ ఇప్పుడు 113 మంది స్టాప్ మాత్రమే హాస్పటల్లో పనిచేస్తున్నారని, ఇంకా ఎక్విప్మెంట్ విషయానికి వస్తే అంబులెన్సులు కొరత ఉందని కనీసం RO ప్లాంట్, ఆక్సిజన్ ప్లాంట్ లు రిపేర్ లో ఉన్నాయని, ఇక ఈ ప్రాంతంలో కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఎక్కువగా ఉన్నారని, కాని డయాలసిస్ సెంటర్ కూడా దాతల సహకారంతో నడుస్తుందని డాక్టర్ కూడా నెలకు రెండుసార్లు వచ్చి వెళ్తున్నారని సభ దృష్టికి తీసుకెళ్లారు. ఇటీవలే హాస్పిటల్లో ఉన్న అత్యంత కీలకమైన ఐసియు వార్డు దాతల సహకారంతో తిరిగి ప్రారంభించామని, కానీ అక్కడ ఐసియుకు సంబంధించిన డాక్టర్ల కొరకు ఉన్నదని అన్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి మార్కాపురం జిల్లా ఆసుపత్రిని వసతులను ఏర్పాటు చేసి, అభివృద్ధి చేయాలని ప్రభుత్వానికి కోరారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.