Andhra
మార్కాపురం సబ్ జైలును తనిఖీ చేసిన జిల్లా జడ్జి భారతి..
మార్కాపురం: ప్రకాశం జిల్లా మార్కాపురంలో జిల్లా జడ్జి భారతి, జిల్లా జైళ్ళ పర్యవేక్షణ అధికారి షరీఫ్ తో కలిసి పట్టణంలోని సబ్ జైలును ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఖైదీల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం కోర్టు ఆవరణలో నిర్మాణంలో ఉన్న కోర్టు భవనాలను వారు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మార్కాపురం జిల్లా కోర్టు జడ్జి శుభవాని, సబ్ కోర్టు జడ్జి దేవేందర్ రెడ్డి, సివిల్ కోర్టు జడ్జి కిషోర్, కోర్టు సిబ్బంది, జైల్లశాఖ అధికారులు పాల్గొన్నారు.
![]()
