Connect with us

Andhra

షేక్ సైదా నాయకత్వంలో పునర్జీవం దిశగా జిల్లా కాంగ్రెస్ పార్టీ..

Published

on

ఒంగోలు: ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం ఒంగోలులోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో DCC అద్యక్షులు షేక్ సైదా నాయకత్వంలో జరిగింది. ఈ సందర్భంగా పార్టీ సంస్థాగత నిర్మాణంపై సమీక్ష నిర్వహించారు. ప్రకాశం జిల్లా లొ గ్రామ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ విస్తరణ గురించి ప్రణాళిక రూపొందించారు. ఈ సందర్భంగా దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పార్లమెంటు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేపట్టిన ఓట్ చోర్ – గద్దిచోడ్ కార్యక్రమానికి మద్దతుగా జిల్లా వ్యాప్తంగా సంతకాల సేకరణ కార్యక్రమంపై APCC వర్కింగ్ ప్రెసిడెంట్.. మాజీ శాసనసభ్యులు షేక్ మస్తాన్ వలి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జిల్లా ఇంచార్జ్ గౌతు సత్యేంద్ర బాబుతో కలిసి నియోజకవర్గాల వారీగా సమీక్ష నిర్వహించారు. ప్రకాశం జిల్లాలో కాంగ్రెస్ పునరుజ్జీవనానికి షేక్ సైదా చేస్తున్న కృషి అనూహ్యమైనది. జిల్లాలోని అన్ని నియోజకవర్గ నాయకులను సమన్వయం చేసుకుంటూ.. పార్టీ విస్తరణ, పటిష్టత పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ, విస్తృత కార్యక్రమాలు చేస్తూ పార్టీ కార్యకర్తలలో ధైర్యాన్ని నింపుతూ.. పార్టీని అభివృద్ధి చేస్తున్న కాంగ్రెస్ పార్టీ జిల్లా అద్యక్షులు షేక్ సైదాని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.